సిగరెట్ తాగాలంటే కోటీశ్వరులు అయ్యిండాలి : దమ్ము కొట్టాలంటే.. దండిగా డబ్బులు ఉండాలి..

సిగరెట్ తాగాలంటే కోటీశ్వరులు అయ్యిండాలి : దమ్ము కొట్టాలంటే.. దండిగా డబ్బులు ఉండాలి..

దమ్ము కొట్టటానికి దమ్ము కావాలా ఏంటీ అని అనుకుంటున్నారా.. అవును.. ఇక నుంచి దమ్ము కొట్టాలంటే దమ్ము ఉండాల్సిందే.. అంతకు మించి మీ దగ్గర దండిగా డబ్బులు కూడా ఉండాలి. అంతే కాదండీ.. మీరు కోటీశ్వరులు అయితేనే సిగరెట్ తాగగలరు.. కోటీశ్వరులు అయితేనే మీరు మంచి డ్రింక్ తాగగలరు.. అదేంటీ.. జేబులో 10 రూపాయలు ఉంటే దమ్ము కొట్టొచ్చు కదా అని అనుకుంటున్నారా.. ఇది ఇప్పటి వరకు మాత్రమే.. మరికొన్ని రోజుల్లో మీ 10 రూపాయల సిగరెట్ 15 రూపాయలు అవుతుంది.. 15 రూపాయల సిగరెట్ 20 రూపాయలు కాబోతున్నది.. ఒక్క సిగరెట్ ధర ఇంతనా అని మైండ్ బ్లాంక్ అయ్యిందా.. అవును.. సిగరెట్లు, టుబాకోలపై 35 శాతం జీఎస్టీ వసూలుకు రంగం సిద్ధం అయ్యింది. అంటే ధరలు అమాంతం పెరగనున్నాయి కాదు.. పెరగటం ఖాయం అన్నమాట..

 కొన్ని రకాల డ్రింక్స్​, సిగరెట్లు, పొగాకు  సంబంధిత ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీని 28 శాతం నుంచి 35 శాతానికి  పెంచాలని జీఎస్టీపై ఏర్పాటైన మంత్రుల గ్రూపు (జీఓఎం) నిర్ణయించిందని అధికార వర్గాలు తెలిపాయి.  బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నాయకత్వంలోని  గ్రూపు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.  ఇక నుంచి రూ.1,500 వరకు ధర ఉండే రెడీమేడ్ దుస్తులపై 5 శాతం, రూ. 1,500 నుంచి రూ. 10వేల మధ్య ఉన్న వాటిపై 18 శాతం జీఎస్టీ విధించనున్నారు.

10వేల కంటే ఎక్కువ ధర ఉన్న వస్త్రాలపై 28 శాతం పన్ను ఉంటుంది.  మొత్తం 148 వస్తువులపై పన్ను రేట్లను మార్చాలని జీఓఎం సిఫార్సు చేసింది.  ఈ నెల 21న జరిగే  జీఎస్టీ మండలిలో ఈ ప్రతిపాదనలపై చర్చ జరిగే అవకాశం ఉంది. జీఎస్టీ రేటు మార్పులపై కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం కారు, వాషింగ్ మెషీన్ వంటి విలాసవంతమైన వస్తువులు,  ఎరేటెడ్ వాటర్,  పొగాకు ఉత్పత్తులు వంటి వస్తువులపై అత్యధికంగా 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు.   రేట్ల మార్పిడిపై జీఓఎం తయారు చేసిన నివేదికను సోమవారం కౌన్సిల్​కు అందజేస్తారు.