పాకిస్థాన్ దుర్ఘటన: లోయలో పడ్డ బస్సులు..35 మంది మృతి

పాకిస్థాన్ దుర్ఘటన: లోయలో పడ్డ బస్సులు..35 మంది మృతి

రావల్పిండి:పాకిస్తాన్ లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 35 మంది చనిపోయారు. ఆదివారం (ఆగస్టు 25, 2024) నాడు రెండు చోట్ల రెండు బస్సులు లోయ లో పడ్డాయి. ఈ ప్రమాదాల్లో 35మంది మృతిచెందారు. పంజాబ్ ప్రావిన్స్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ మధ్య సరిహద్దుల్లో ఆజాద్ పట్టణంలో సమీపంలో బస్సు లోయ లోపడి 23 మంది మృతిచెందగా.. మరో ఘటనలో బలూచిస్థాన్‌లో బస్సు లోయలో పడి 12 మంది మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

పంజాబ్ ప్రావిన్స్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ మధ్య సరిహద్దులోని ఆజాద్ పట్టాన్ పట్టణం సమీపంలో బస్సు లోయలో పడిపోవడంతో 23 మంది మరణించినట్లు అధికా రులు తెలిపారు.. ప్రమాదవశాత్తు లోయపోడగా..23మంది ప్రాణాలుకోల్పోయారు. ఇప్పటివరకు 23మృతదేహాలనుస్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరికొంత మందికి తీవ్రగాయాలు కాగా... చికిత్స కోసం సమీప ఆస్పత్రులకు తరలించారు. 

మరో దుర్ఘటనలో బలూచిస్తాన్‌లోని మక్రాన్ కోస్టల్ హైవేపై పాకిస్థాన్ పౌరులు ఇరాన్ లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ప్రమాద కర మైన రహదారిలో పోలీసులనుంచి తప్పించుకుని ఇరాన్ లోకి ప్రవేశించేక్రమంలో డ్రైవర్ అతి వేగంతో నడపడం..బస్సులోయలో పడింది. ఈ ప్రమాదం లో బస్సులో ప్రయాణిస్తున్న 12 మంది మృతిచెందినట్లు పోలీసు అధికారులు చెప్పారు.