ఇప్పటివరకు నటించిన చిత్రాలకంటే ‘35 చిన్న కథ కాదు’ చిత్రం అన్ని విషయాల్లోనూ తృప్తిని ఇచ్చిందని చెప్పాడు విశ్వదేవ్. తను లీడ్ రోల్‌లో నివేదా థామస్‌కు జంటగా నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా విశ్వదేవ్ మాట్లాడుతూ ‘కథ వినగానే ఎలాగైనా ఇందులో నటించాలనుకున్నా. అంతలా కనెక్ట్ అయ్యా. నంద కిషోర్ చాలా మెచ్యూర్‌గా సినిమాని హ్యాండిల్ చేశాడు. ఇంపాక్ట్ ఫుల్ రోల్స్ చేయడం నాకిష్టం. ఇందులో ప్రసాద్ పాత్ర అలాంటిదే.
నా పాత్రకు మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. విమర్శకులు, ప్రేక్షకులు ముక్త కంఠంతో సినిమాని ప్రశంసిస్తూ.. సినిమాకి డిస్టింక్షన్ మార్కులు వేశారు. పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీ అంతా కలిసి చూసే బ్యూటిఫుల్ సినిమా ఇది. నివేదా థామస్ చాలా సపోర్ట్ చేశారు. ఆమె సీనియర్, నేను జూనియర్ అని ఎక్కడా తేడా చూపించలేదు. తిరుపతి నేపథ్యం డివైన్ ఫీలింగ్ తీసుకొచ్చింది. అన్నీ ఆర్గానిక్‌గా అద్భుతంగా కుదిరాయి. మంచి కథలని ఎంచుకోవడంలో రానా ఎక్స్‌పర్ట్. ఆయన సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ ఈ చిత్రాన్ని ప్యాషనేట్‌గా నిర్మించారు’ అని చెప్పాడు.