బేల కస్తూర్భా బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

ఆదిలాబాద్ జిల్లా బేల కస్తూర్భా బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో 35 మంది  విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో కొంతమందిని బేల PHCకి, మరికొంతమందిని రిమ్స్ కి తరలించి, చికిత్స అందిస్తున్నారు. తమకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 

విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. కస్తూర్భా స్కూల్ వద్ద పేరెంట్స్ తో పాటు కొంతమంది స్థానికులు కూడా ఆందోళనకు దిగారు. స్కూల్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో గేటు వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులకు సరైన భోజనం పెట్టడం లేదని, నాణ్యమైన ఫుడ్ పెట్టకపోవడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.