సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలోని గుమ్మడిదల టోల్ ప్లాజా వద్ద మంగళవారం చేపట్టిన పోలీసుల తనిఖీల్లో 350 గ్రాముల అల్ఫ్రాజోలం పట్టుబడిందని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్తెలిపారు. అల్లాదుర్గం మండలం గడి పెద్దపూర్గ్రామానికి చెందిన కల్లు వ్యాపారి డొల్లూరి సాయిలు అలియాస్రాజు బైక్‌పై అనుమానాస్పదంగా వెళ్తుండగా పోలీసులు ఆపి చెక్‌చేశారు. అతడి వద్ద రూ. 3.50 లక్షల విలువైన అల్ఫాజోలం గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకుని విచారించారు.
ఆందోల్ మండలం తాలెల్మకు చెందిన చిన్నాన్న లింగన్నగారి నారాయణ మూర్తి సాయంతో పుల్కల్మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన కలాలి అశోక్గౌడ్వద్ద అల్ప్రాజోలం కొనుగోలు చేసి హైదరాబాద్‌లో అమ్మేందుకు తీసుకెళ్తున్నట్టు చెప్పాడు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, పటాన్‌చెరుకు చెందిన ప్రధాన నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు.
మాడిగి ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద..
జహీరాబాద్ : అల్ఫ్రాజోలం టాబ్లెట్స్, కోడినెట్సిరప్ బాటిల్స్ ను భారీగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ రూ.15.95 లక్షలు ఉంటుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం మాడిగి ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద మంగళవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా కర్నాటక నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేసి వీటిని గుర్తించారు. వీటిని తరలిస్తున్న ఎండీ అస్లాం, ఎండీ అలీం ఖాన్ ను అదుపులోకి తీసుకుని విచారించారు.
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ ఏరియాలో పర్మిషన్ లేని షాద్ మెడికల్ షాపులో అమ్ముతున్నట్టు తెలిపారు. కారుతో పాటు అల్ర్ఫాజోలం ట్యాబ్లెట్లు, కోడినెట్ సిరప్ ను సీజ్‌చేసి కేసు నమోదు చేసినట్టు మెదక్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు.