యాదగిరిగుట్టలో 350 జిలెటిన్ స్టిక్స్ సీజ్

యాదగిరిగుట్టలో 350 జిలెటిన్ స్టిక్స్ సీజ్
  • హైదరాబాద్ కు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసిన ఎస్వోటీ పోలీసులు

యాదగిరిగుట్ట, వెలుగు :  అక్రమంగా బ్లాస్టింగులకు వాడుతున్న జిలెటిన్ స్టిక్స్ ను ఎస్వోటీ పోలీసులు  స్వాధీనం చేసుకుని వ్యక్తిని అరెస్ట్ చేశారు. యాదగిరిగుట్టలోని లోటస్ టెంపుల్ వెనక ఓ వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా జిలెటిన్ స్టిక్స్ తో బ్లాస్టింగులు చేస్తున్నాడు. దీనిపై సమాచారం అందడంతో గురువారం ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. వ్యక్తిని అదుపులోకి తీసుకుని 350 జిలెటిన్  స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. అతడిని హైదరాబాద్ కు చెందిన విజయ్ గా గుర్తించి యాదగిరిగుట్ట పోలీసులకు అప్పగించారు.  జిలెటిన్ స్టిక్స్ ను సీజ్ చేసి, నిందితుడిపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు యాదగిరిగుట్ట సీఐ రమేశ్​తెలిపారు.