ఇల్లీగల్​ గేమింగ్ ​వెబ్​సైట్లకు తాళం.. 357 సైట్లను మూసేయించిన డీజీసీఐ

ఇల్లీగల్​ గేమింగ్ ​వెబ్​సైట్లకు తాళం..  357 సైట్లను మూసేయించిన డీజీసీఐ
  • 2,400 ఖాతాల జప్తు 

న్యూఢిల్లీ: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్  టాక్స్  ఇంటెలిజెన్స్ (డీజీజీఐ)  చట్టవిరుద్ధంగా నడుస్తున్న ఆఫ్​షోర్​357 ఆన్‌‌లైన్ గేమింగ్ వెబ్‌‌సైట్‌‌లను బ్లాక్ చేసింది. ఇవి పన్ను ఎగవేత, మనీ లాండరింగ్  ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొన్నట్లు  అనుమానిస్తున్నారు. ఈ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన 2,400 బ్యాంక్ ఖాతాలను డీజీజీఐ అటాచ్ చేసింది.  ఈ ఖాతాలలోని డబ్బు చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నుంచి వచ్చిందని భావిస్తున్నారు.  

ఆన్‌‌లైన్ గేమింగ్ పరిశ్రమలో పన్ను ఎగవేత,  మనీ లాండరింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడానికి డీజీజీఐ ఈ చర్యలు తీసుకుంది.   కస్టమర్లను మోసపూరిత కార్యకలాపాల నుంచి రక్షించడం,  ఆన్‌‌లైన్ గేమింగ్ పరిశ్రమలో పారదర్శకత కోసం ఈ చర్యలు తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. చాలా కంపెనీలు జీఎస్టీ చెల్లించడం లేదని, ఫ్రాడ్‌ ​అకౌంట్ల ద్వారా డబ్బును దేశం దాటిస్తున్నాయని డీజీజీఐ పేర్కొంది.