కుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం

  • మహారాష్ట్ర మాల్వాన్​లో ఘటన  

ముంబై: మహారాష్ట్రలో ఏర్పాటు చేసిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌‌‌‌‌‌‌‌ 35 అడుగుల విగ్రహం కుప్పకూలింది. మాల్వాన్ లోని రాజ్ కోట్ కోటలో సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ విగ్రహం కూలిపోయింది. రెండ్రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు విగ్రహం కూలిందని ఓ అధికారి తెలిపారు. సింధుదుర్గ్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని రాజ్‌‌‌‌‌‌‌‌కోట్‌‌‌‌‌‌‌‌ కోటలో 35 అడుగుల శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నేవీ డే సందర్భంగా గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అయితే, మహారాష్ట్రలో గత రెండు, మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే భారీ విగ్రహం కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎక్స్ ఫర్ట్స్ ను రంగంలోకి దింపి విగ్రహం కూలిపోవడానికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.