- 3.6 లక్షల కనెక్షన్లకు ఆధార్ సీడింగ్ కాలె
- ఫ్రీ వాటర్ స్కీమ్‌పై అవగాహన కల్పించని వాటర్ బోర్డు
- ఆధార్ సీడింగ్‌కు ఇంకా 19 రోజులే గడువు
- పెండింగ్ బిల్లుల జారీకి సాఫ్ట్‌వేర్‌లో మార్పులు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్‌సిటీలో ఫ్రీ వాటర్ స్కీమ్ అమలును వాటర్ బోర్డు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా.. వినియోగదారుల సందేహాలు తీర్చడం, క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడంలో ఫెయిలైంది. కాలనీలు, బస్తీలు, అపార్టుమెంట్లలోకి అధికారులు, సిబ్బంది వెళ్లి సీడింగ్ చేయించాల్సి ఉండగా, ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు లేదు. సిటీలో మొత్తం 10.8లక్షల నల్లా కనెక్షన్లగాను ఇప్పటికి 6.9 లక్షలకు మాత్రమే ప్రాసెస్ పూర్తైంది. ఇంకా 3.6 లక్షలకు ఆధార్ సీడింగ్ కావాల్సి ఉంది. ఆగస్టు15లోపు గడువు ఉండగా, ఆ లోపు అనుసంధానం చేసుకోకపోతే, గత 8 నెలల బిల్లులు కట్టాల్సిందేనని వాటర్ బోర్డు వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు పెండింగ్ బిల్లుల జారీకి బిల్లింగ్ సాఫ్ట్ వేర్‌లోనూ వాటర్ బోర్డు మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఆధార్ సీడింగ్నల్లాకు పని చేస్తున్న వాటర్ మీటర్ ఉంటేనే ఫ్రీ వాటర్ స్కీమ్‌కు అర్హత ఉంటుంది. గడువు లోపుఆధార్ సీడింగ్, వాటర్ మీటర్ ఏర్పాటు చేసుకోకుంటే వినియోగదారులపై భారీగా నల్లా బిల్లుల భారం పడనుంది. ఇప్పటికే గతేడాది డిసెంబర్ నుంచి ఏప్రిల్ 30 వరకు ఒకేసారి బిల్లులు జారీ చేయగా, ఇంకా సీడింగ్ చేసుకోని వినియోగదారులకు వేలల్లో బిల్లు రానుంది. క్షేత్రస్థాయిలో సరైన అవగాహన కల్పించకపోవడంతోనే ఓనర్లు ఆధార్ సీడింగ్ చేసుకునేందుకు వినియోగదారులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
ఆరు నెలలుగా నడుస్తున్నా..
గత డిసెంబర్ నెలాఖరు నుంచి ఫ్రీ వాటర్ స్కీమ్ అమలవుతుండగా, క్యాన్ నంబర్‌కు ఆధార్ సీడింగ్ చేసుకుంటేనే ఇది వర్తిస్తోంది. ఆధార్‌సీడింగ్ ప్రాసెస్ గత 6 నెలలుగా కొనసాగుతోంది. మరో 45 రోజుల గడువు పెంచగా, ఆగస్టు15తో ముగియనుంది. దీన్ని బట్టి చూస్తే మరో 19 రోజుల గడువు ఇచ్చినా ఇంకా 3.6లక్షల కనెక్షన్లకు మీటర్ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. యజమానులు స్వచ్ఛందంగా వచ్చి ఆధార్ సీడింగ్ చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నా జనం ముందుకు వస్తలేరని వాటర్ బోర్డు అధికారులు చెప్తున్నారు.
ఆన్లైన్లో అప్లయ్ ఇలా..
నల్లా కనెక్షన్‌కు ఆధార్ సీడింగ్ చేసుకోవాలంటే https://bms.hyderabadwater.gov.in/20kl/ లేదా https://www.hyderabad water.gov.in/en/ వెబ్ సైట్ ఓపెన్ చేసి ఫ్రీ వాటర్ సప్లయ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. కస్టమర్ పేరు, కరెక్షన్, ఆధార్ లింకింగ్, ఆధార్ డీ లింకింగ్ వంటి సేవలను పొందొచ్చు. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు రిజిస్టర్ ఫర్ ఫ్రీ వాటర్ సప్లయ్ ఆప్షన్ పై క్లిక్ చేసి, నల్లా మీటర్ వివరాలు ఇవ్వాలి. ఇలా ఫ్రీ వాటర్ స్కీమ్ కోసం ఆన్లైన్లో అప్లయ్ చేసుకునే వెసులుబాటును వాటర్ బోర్డు కల్పించింది. దీనిపై అవగాహన లేకపోవడంతో చాలామంది మీ సేవ సెంటర్లకు వెళ్తున్నారు. ఏరియా వాటర్ బోర్డు ఆఫీసుల వద్దనే ఇలాంటి సౌకర్యం కల్పిస్తే మరింత త్వరగా పూర్తవుతుందని సిటీ జనాలు పేర్కొంటున్నారు. లేదంటే మీ సేవ, ఇంటర్ నెట్ కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తుందని అంటున్నారు.