పూరన్ విధ్వంసం.. ఒకే ఓవర్లో ఏకంగా 36 పరుగులు

పూరన్ విధ్వంసం..  ఒకే ఓవర్లో ఏకంగా 36 పరుగులు

టీ20 ప్రపంచకప్‌లో  భాగంగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ ఆటగాడు  నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టి్ంచాడు.  అజ్మతుల్లా ఒమర్జాయ్  వేసిన 4వ ఓవర్లో ఏకంగా 36 పరుగులు వచ్చాయి. ఇందులో పురన్  3 సిక్సులు, 2 ఫోర్లతో 26 పరుగులు చేయగా మిగితా 10 పరుగులు బైన్స్ రూపంలో వచ్చాయి. దీంతో అజ్మతుల్లా  ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన స్టువర్ట్ బ్రాడ్ పేరిట ఉన్న  రికార్డును సమం చేశాడు.  2007 టీ20 వరల్డ్ కప్ లోభాగంగా డర్బన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన  మ్యాచ్ లో టీమిండియా మాజీ ఆటగాడు  యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. దీని తరువాత ఒక ఓవర్‌లో 36 పరుగులు చేయడం టీ20వరల్డ్ కప్ లో ఇది ఐదవసారి.

టీ20 ప్రపంచకప్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు

  • 36 పరుగులు (6,6,6,6,6,6) - యువరాజ్ సింగ్ vs స్టువర్ట్ బ్రాడ్ (IND vs ENG), డర్బన్ 2007
  • 36 పరుగులు (6,4nb,5wd,0,LB4,4,6,6) - నికోలస్ పూరన్ vs అజ్మతుల్లా ఒమర్జాయ్ (WI vs AFG), సెయింట్ లూసియా 2024
  • 33 పరుగులు (wd,6,4,wd,nb,1nb,6 ,wd,1,6,4) -  ఆరోన్ జోన్స్ vs జెరెమీ గోర్డాన్ (USA vs CAN), డల్లాస్ 2024
  • 32 పరుగులు (4,W,6nb,1nb,6,6,6,1) -  జానీ బెయిర్‌స్టో vs ఇజతుల్లా దవ్లత్జాయ్ (ENG vs AFG), కొలంబో 2012
  • 30 పరుగులు (4,1,4,6,6,4nb,4) -  గ్లెన్ మాక్స్‌వెల్ vs బిలావల్ భట్టి (AUS vs PAK), ఢాకా 2014

 నికొలస్ పూరన్ రికార్డ్ సృ‌ష్టించారు. పురుషుల క్రికెట్‌లో వెస్టిండీస్‌ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో 2వేల రన్స్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచారు. అఫ్గాన్‌పై ఆయన 53 బంతుల్లోనే 98 పరుగులు చేశారు. మొత్తంగా విండీస్ 218 రన్స్ చేయగా.. ఛేదనలో అఫ్గాన్ 114 పరగులకే ఆలౌట్ అయింది.