- 36 టీచర్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ
ముషీరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్ సంఘాలు బలపరిచిన హర్షవర్ధన్‌రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని 36 టీచర్సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు తెలిపారు. గురువారం బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కమిటీ సమావేశం నిర్వహించారు. జేఏసీ చైర్మన్ మణిపాల్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ పర్వత సత్యనారాయణ హాజరై మాట్లాడారు.
హర్షవర్ధన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. టీచర్లంతా మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. జేఏసీ కో చైర్మన్ లు గోవింద్ నాయక్, లచ్చి రామ్, నర్సింలు, టి సత్యనారాయణ, రఘునందన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.