36 ఏళ్ల తర్వాత మరోసారి మ్యాజిక్ రిపీట్ చేయనున్నారు విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) - దిగ్గజ డైరెక్టర్ మణిరత్నం(Mani Ratnam). వీరిద్దరి కాంబోలో 1987 లో వచ్చిన నాయకన్..తెలుగులో నాయకుడు సెన్సేషనల్ హిట్ అందుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ (RKFI), మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ క్రేజీ కాంబినేషన్ లో కమల్ హాసన్ KH234 మూవీ రాబోతుందని తెలిపారు.
ఈ క్రమంలో Begin the Begin అని మేకర్స్ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ కు వెళ్లనుందని తెలుస్తోంది. ఈ మూవీ పూజా కార్యక్రమంలో టాప్ టెక్నీషియన్లంతా పాల్గోన్నారు. ఈ సినిమాకు ఎడిటర్‌గా శ్రీకర్ ప్రసాద్, కెమెరామెన్‌గా రవి కే చంద్రన్, అన్బరివ్ ఫైట్ మాస్టర్ గా, ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ పూజా ఈవెంట్ కొరకు రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందంతే. ఇదే లెవెల్లో సినిమాలో కూడా ఉంటే..కమల్ హిట్ మూవీ విక్రమ్‌ని మించిపోయేలా కలెక్షన్లు రావడం మాత్రం పక్కా అంటున్నారు ఫ్యాన్స్.
అప్పట్లో వీరి కాంబోలో వచ్చిన నాయకుడు మూవీ కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. దాదాపు 36 సంవత్సరాల తర్వాత మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ కాబోతుండడంపై ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. త్వరలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
ALSO READ :డేంజర్ జోన్లో ఆ ఇద్దరు.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
ప్రస్తుతం కమల్ హాసన్ తమిళ శంకర్ డైరెక్షన్ లో భారతీయుడు 2 మూవీ షూటింగ్ క్లైమాక్స్ దశకు వచ్చినట్లు సంచాచారం. అంతేకాకుండా శంకర్ భారతీయుడు మూడో పార్టుకు సంబంధించిన షూట్ కూడా చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
Unified forces of Indian Cinema, Let the celebration begin!#KH234 #Ulaganayagan #KamalHaasan #HBDUlaganayaganNov7@ikamalhaasan #ManiRatnam @arrahman#Mahendran @bagapath @MShenbagamoort3 @RKFI @MadrasTalkies_ @RedGiantMovies_ @dop007 @sreekar_prasad @anbariv #SharmishtaRoy… pic.twitter.com/bzyX8A7llQ
— Raaj Kamal Films International (@RKFI) October 26, 2023