
తెలంగాణ, చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో కూంబింగ్ కొనసాగుతోంది. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఏకంగా మావోయిస్టుల మృతుల సంఖ్య 37కి చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఆపరేటన్ కాగర్ పేరుతో.. కొన్ని నెలలుగా కర్రెగుట్టల్లో మావోల వేట సాగిస్తున్నారు CRPF బలగాలు. ప్రత్యేక హెలికాప్టర్లతో నిఘా పెట్టారు.
ఈ క్రమంలోనే 2025, ఏప్రిల్ 25వ తేదీ రాత్రి.. కర్రెగుట్టల్లో సీఆర్ పీఎఫ్ బలగాలకు.. మావోయిస్టులు ఎదురుపడ్డారు. రెండు వర్గాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో.. 28 మంది మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది. మావోల ఎన్ కౌంటర్పై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కర్రెగుట్టల్లో మొత్తం వెయ్యి మంది మావోయిస్టులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు భద్రతా బలగాలు.
2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేయాలని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఇందు కోసం ఆపరేషన్ కగార్ చేపట్టింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో మావోయిస్టు పార్టీ కీలక నేత హిడ్మాతో పాటు మరో వెయ్యి మందికి పైగా నక్సలైట్లు ఉన్నట్లు భద్రతా దళాలకు నిఘావర్గాల నుంచి సమాచారం అందింది.
దీంతో కర్రెగుట్టలో ఐదు రోజుల నుంచి కేంద్ర, రాష్ట్ర బలగాలు కూంబింగ్ చేపట్టాయి. తెలంగాణ-ఛత్తీస్గఢ్-మహారాష్ట్ర మూడు వైపుల నుంచి కర్రెగుట్టలను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. హిడ్మాతో పాటు మరికొందరు కీలక నేతలే లక్ష్యంగా భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో భద్రతా దళాలు, మవోయిస్టుల మధ్య భీకర ఎదురు కాల్పులతో కర్రెగుట్టలు తుటాల మోతతో దద్దరిల్లుతున్నాయి.
శనివారం (ఏప్రిల్ 26) భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 28 మంది నక్సలైట్లు హతమైనట్లు సమాచారం. దీనిపై అధికారులు, ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఛత్తీస్గడ్, తెలంగాణా సరిహద్దు కర్రెగుట్టల్లో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఏ క్షణాన ఏ జరుగుతుందోనని సమీప గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
మరోవైపు కర్రెగుట్టల్లో కేంద్ర, రాష్ట్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయాలని ఇప్పటికే మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని.. నెలరోజుల పాటు ఆపరేషన్ కగార్ ఆపాలని విజ్ఞప్తి చేసింది. మావోయిస్టు పార్టీ అభ్యర్థనను ఏ మాత్రం లెక్కచేయని భద్రత దళాలు నక్సలైట్ల ఏరివేత లక్ష్యంగా కర్రెగుట్టల్లో ముందుకు వెళ్తున్నాయి.