- మహారాష్ట్రలో స్వాధీనం చేసుకున్న పోలీసులు
పాల్ఘర్ : మహారాష్ట్రలోని పాల్ఘర్లో పోలీసులు రూ.3.70 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. శుక్రవారం వ్యానులో రూ.3.70 కోట్లను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు, నిఘా అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే వాహన తనిఖీలు నిర్వహించగా రూ.3.70 కోట్ల నగదు దొరికింది.
ఈ క్యాష్‌కు సంబంధించి ఆధారాలు చూపకపోవడంతో క్యాష్ సీజ్ చేశామని అధికారులు తెలిపారు. నవీ ముంబైలో ఉన్న ఓ కంపెనీ నుంచి పాల్ఘర్‌కు నగదును తీసుకెళ్తున్నామని అధికారులకు వ్యాన్ సిబ్బంది చెప్పారు.