తెలంగాణ ఆరోగ్యశాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గత నెలలో విడుదల చేసిన ఫార్మాసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అనుబంధంగా ఈ నోటిఫికేషన్ విడుదలైంది. గత నెలలో 2050 నర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా, తాజాగా మరో 272 పోస్టులను జతచేశారు. దాంతో భర్తీ చేయనున్న మొత్తం నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య 2322కి చేరింది.
Also Read :- మరీ ఇంత దారుణమా..? కరీంనగర్లో మైత్రి హోటల్ తెలుసా..?
మరోవైపు 633 ఫార్మాసిస్ట్ పోస్టులకు అదనంగా మరో 99 పోస్టులు కలుపుతూ నోటిఫికేషన్ వెలువడింది. దాంతో మొత్తం ఫార్మసిస్ట్ పోస్టుల సంఖ్య 732కి చేరింది.
దరఖాస్తు గడువు దగ్గర పడుతోంది
నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తులకు అక్టోబర్ 14 తుది గడువు. నవంబర్ 17న ఆన్‌లైన్‌లో(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఇక ఫార్మసిస్ట్ పోస్టులకు అక్టోబర్ 21వ తేదీ తుది గడువు కాగా, నవంబర్ 30న రాత పరీక్ష నిర్వహించనున్నారు. జోన్లు, కేటగిరీల వారీగా ఖాళీల వివరాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో(https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm) అందుబాటులో ఉంచారు.