భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుకున్న 3,723 కేజీల గంజాయిని దహనం చేశామని ఎస్పీ బి. రోహిత్ రాజు తెలిపారు. హేమచంద్రాపురం గ్రామ శివారల్లో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో గంజాయిని పోలీస్‌లు దహనం చేశారు. ఈ సందర్భంగా శనివారం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 13 పోలీస్ స్టేషన్ల పరిధిలో 55కేసుల్లో దాదాపు రూ. 9.31కోట్ల విలువైన 3,723 కేజీల నిషేధిత గంజాయిని సీజ్ చేశామన్నారు.
గంజాయిని విక్రయించే వారితో పాటు తాగే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణాపై పటిష్ట నిఘా పెడతున్నామని చెప్పారు. ఈ ప్రోగ్రాంలో డీఎస్పీ రెహమాన్, సతీశ్‌కుమార్, మల్లయ్య స్వామి, సీఐ శ్రీనివాస్‌తో పాటు పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.