భద్రాచలం, వెలుగు : భద్రాచలం టౌన్‌లోని సుభాశ్‌నగర్ కాలనీ వద్ద అసంపూర్తిగా ఉన్న గోదావరి కరకట్ట నిర్మాణానికి బుధవారం రాష్ట్ర ప్రభుత్వం రూ.38 కోట్లు మంజూరు చేసింది. గతంలోనే ప్యాకేజీ నెంబర్ 74లో ఈ కరకట్ట నిర్మాణానికి నిధులు ఇచ్చినా భూసేకరణలో సమస్యల వల్ల కాంట్రాక్టర్ పనులు మధ్యలోనే వదిలేశారు. 2007 నుంచి 500 మీటర్ల పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి.
ఇటీవల మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఇరిగేషన్ఇంజినీర్ల సాయంతో ఎస్టిమేషన్ తయారు చేయించి సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లారు. ఇరిగేషన్ ఇంజినీర్లు పాత అగ్రిమెంట్లు మొత్తం రద్దు చేసి, మిగిలిన పనులు పూర్తి చేసేందుకు రూ.38 కోట్లతో పనులు చేయాలని నివేదిక రూపొందించారు. దీంతో ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నట్లు జీవో జారీ చేసింది.