హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలోని 38 మంది ఉద్యోగులు శనివారం పదవీ విరమణ పొందారు. హెడ్డాఫీసులో వారికి సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బల్దియా అడిషనల్ కమిషనర్ నళిని పద్మావతి మాట్లాడుతూ.. రిటైర్మెంట్ తర్వాత కొత్త జీవితం మొదలవుతుందని చెప్పారు.
దానిని సరికొత్తగా మలుచుకోవడం మన చేతిలోనే ఉంటుందన్నారు. 38 మంది ఉద్యోగులను చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాపద్మజ, జాయింట్ కమిషనర్ జయంత్ రావు, సీపీఆర్ఓ మహమ్మద్ ముర్తుజా అలీతో కలిసి ఘనంగా సన్మానించారు.