అంతా 15 సెకన్లలోనే.. : బీటెక్ ఉద్యోగి.. కారులో వచ్చాడు.. దూకాడు.. చనిపోయాడు..

అంతా 15 సెకన్లలోనే.. : బీటెక్ ఉద్యోగి.. కారులో వచ్చాడు.. దూకాడు.. చనిపోయాడు..

బతకటం కంటే.. చావటానికి చాలా ధైర్యం కావాలంటారు.. ఇప్పుడు మాత్రం చావటానికి అస్సలు వెనకా ముందూ ఆలోచించటం లేదు.. కారణం ఏదైనా కావొచ్చు రోజురోజు ఆత్మహత్యలు పెరగటం ఆందోళన కలిగించే అంశం.. ముంబైలోని అతుల్ సేతు.. సముద్రంపై నిర్మించిన అతిపెద్ద వంతెన పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

కారుటూరి శ్రీనివాస్ అనే 38 ఏళ్ల వ్యక్తి బీటెక్ చదువుకున్నాడు. కొన్నాళ్లు దుబాయ్ లో ఉద్యోగం చేశాడు. ఏడాది కిత్రం ముంబై తిరిగి వచ్చాడు. ఇండియా వచ్చిన తర్వాత లోథా గ్రూపులో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు అక్కడ కూడా మానేశాడు.. 2024 జూలై 24వ తేదీ బుధవారం మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాలకు తన కారులో అతుల్ సేతు బ్రిడ్జిపైకి వచ్చాడు. కారు ఆపాడు. ఆ వెంటనే బ్రిడ్జి పైనుంచి సముద్రంలోకి దూకేశాడు.. ఈ విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. 

కారుటూరి శ్రీనివాస్ ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణం అంటున్నారు పోలీసులు. సీసీ కెమెరాలో చూసిన కంట్రోల్ రూం సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వటం.. ఓ పోలీస్ టీం స్పాట్ కు వచ్చింది. కారులోని అతని పర్స్ లోని వివరాల ఆధారంగా గుర్తించారు. శ్రీనివాస్ కు భార్య, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. కారులో ఎలాంటి సూసైడ్ నోట్ లేదు. ప్రస్తుతం లోథా గ్రూపులోనూ ఉద్యోగం చేయటం లేదని.. ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వర్క్ కోసం ప్రయత్నిస్తున్నట్లు బంధువులు చెబుతున్నారు. 

ALSO READ | ట్రీట్ మెంట్ తీసుకుంటూ పేషెంట్ మృతి

శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్న తీరు మాత్రం కలకలం రేపుతోంది. అంతా క్షణాల్లో జరిగిపోయింది. మొత్తం 15 సెకన్లలోనే అంతా అయిపోయింది. వేగంగా రావటం.. కారు ఆపటం.. ఆ వెంటనే కారు దిగటం.. సముద్రంలోకి దూకటం.. అంతా 15 సెకన్లలోనే జీవితాన్ని ముగించేసుకున్నాడు అంటూ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చనిపోవాలని బలంగా అనుకున్న తర్వాతనే ఇలా చేసి ఉంటాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.