ప్రజావాణికి 384 దరఖాస్తులు

ప్రజావాణికి 384 దరఖాస్తులు

పంజాగుట్ట, వెలుగు : బేగంపేటలోని ప్రజాభవన్​లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 384 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. వాటిలో మైనారిటీ వెల్ఫేర్​కు సంబంధించినవి 255, పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధికి 60, విద్యుత్​ శాఖకు సంబంధించి 24, రెవెన్యూ సమస్యలపై 15

ఇతర శాఖలకు చెందిన 31 అర్జీలు ఉన్నాయి. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్​ చిన్నారెడ్డి పర్యవేక్షణలో నోడల్​అధికారి దివ్య దేవరాజన్​ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.