
ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్, ఐఏఎస్ బదిలీల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న వేళ భారీ స్థాయిలో బదిలీలు చేపట్టింది. ఇటీవల ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన సర్కార్.. ఇప్పుడు ఐపీఎస్ లను కూడా బదిలీ చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 39 ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ 2 జీవోలను విడుదల చేసింది ప్రభుత్వం. అయితే గత నెలలోనే ఈ బదిలీలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ సీఎం జగన్ ఆమోదం లభించకపోవడంతో వాయిదా పడింది. దీంతో ఇప్పుడు భారీ ఎత్తున బదిలీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు అందించారు.
మరోవైపు రాష్ట్రంలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలపై ప్రజా ప్రతినిధుల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. వీరి స్ధానంలో మరొకరిని నియమించాలనే ప్రతిపాదనలు కూడా రావడంతో దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఏడాదిలో ముఖ్యమైన అధికారులకు కీలక స్ధానాలు దక్కే అవకాశం ఉండటంతో అధికారుల్లోనూ దీనిపై టెన్షన్ నెలకొంది.
బదిలీ అయినా ఐపీఎస్ అధికారులు..
విక్రాంత్ పాటిల్–పార్వతీపురం మన్యం ఎస్పీ
వాసన్ విద్యా సాగర్ నాయుడు–లా అండ్ ఆర్డర్ డీసీపీ,విశాఖ సిటీ
గరుడ్ సుమిత్ సునీల్–ఎస్పీ,SIB
తుహిన్ సిన్హా–ఎస్పీ,అల్లూరి జిల్లా
ఎస్.సతీష్ కుమార్–కాకినాడ జిల్లా ఎస్పీ
ఎం. రవీంద్రనాధ్ బాబు–GAD కి రిపోర్ట్
కేవీ మురళి కృష్ణ–అనకాపల్లి జిల్లా ఎస్పీ
గౌతమి శాలి–APSP 16వ బెటాలియన్ కమాండెంట్
సీహెచ్.సుధీర్ కుమార్ రెడ్డి–తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ
పి.శ్రీధర్–కోనసీమ జిల్లా ఎస్పీ
డి.మేరీ ప్రశాంతి–ఏలూరు జిల్లా ఎస్పీ
రాహుల్ దేవ్ శర్మ–APSP 5వ బెటాలియన్ కమాండెంట్.
తిరుమలేశ్వర్ రెడ్డి–నెల్లూరు జిల్లా ఎస్పీ
సీహెచ్ విజయరావు–APSP 3వ బెటాలియన్ కమాండెంట్
ఆర్.గంగాధర్ రావు–అన్నమయ్య జిల్లా ఎస్పీ
వి.హర్షవర్ధన్ రాజు–సీఐడీ ఎస్పీ
కె.శ్రీనివాసరావు–అనంతపురం ఎస్పీ
ఫకీరప్ప–సీఐడీ ఎస్పీ
ఎస్వీ మాధవ్ రెడ్డి–సత్య సాయి జిల్లా ఎస్పీ
రాహుల్ దేవ్ సింగ్–విజయవాడ రైల్వే ఎస్పీ
జి.కృష్ణ కాంత్ –కర్నూల్ ఎస్పీ
సిద్దార్ద్ కౌశల్ –ఆక్టోపస్ ఎస్పీ
అజిత వేజెండ్ల–విజయవాడ డీసీపీ(జగ్గయ్యపేట)
పి.జగదీష్–APSP 14వ బెటాలియన్ కమాండెంట్
బిందు మాధవ్ గరికపాటి–గ్రే హౌండ్స్ ఎస్పీ
జీవీజీ అశోక్ కుమార్ డీఐజీ, ఎలిరి రేంజ్
.జి.పాల రాజు–ఐజీ,గుంటూరు రేంజ్
R.N.అమ్మి రెడ్డి–డీఐజీ, అనంతపురం రేంజ్
ఎం. రవి ప్రకాష్–డీఐజీ,సెబ్
బి.రాజ కుమారి–APSP డీఐజీ
సర్వశ్రేష్ఠ త్రిపాఠి–అడ్మిన్ డీఐజీ,డీజీపీ ఆఫీస్
కోయ ప్రవీణ్–డీఐజీ, గ్రే హౌండ్స్
శంక బ్రత బాగ్చి–అడిషనల్ డీజీ,లా అండ్ ఆర్డర్
రవి శంకర్ అయ్యనార్–విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ డీజీ
అతుల్ సింగ్–పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్
ఏపీఎస్పీ అడిషనల్ డీజీ గాను అదనపు బాధ్యతలు.
మనీష్ కుమార్ సిన్హా–జీఎడికి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
సీహెచ్.శ్రీకాంత్–CID ,ఐజీ
పి.వెంకట్రామి రెడ్డి–పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గా పూర్తి అదనపు బాధ్యతలు.
సీఎం త్రివిక్రమ్ వర్మ–విశాఖ సిటీ కమిషనర్.
2023 ఏప్రిల్ నెలతో వచ్చే ఏడాది జరిగే ఎలక్షన్ కు ఒక సంవత్నరం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో కీలకమైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. అసలే ముందస్తు ఎన్నికల ఊహాగానాలు కూడా వెలుపడుతున్న క్రమంలో పరిస్ధితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. దీంతో సాధ్యమైనంత వరకూ తమకు అనుకూలంగా ఉండే అధికారుల్ని కీలక స్ధానాల్లో నియమించేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నాట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు ఏపీలో చర్చనీయమైంది.