వనపర్తి జిల్లాకు 39 మంది జూనియర్ లెక్చరర్లు

వనపర్తి జిల్లాకు 39 మంది జూనియర్ లెక్చరర్లు

వనపర్తి, వెలుగు: జిల్లాలోని 11 గవర్నమెంట్​ జూనియర్  కాలేజీలకు 39 మంది జూనియర్  లెక్చరర్లను కేటాయించినట్లు డీఐఈవో ఎర్ర అంజయ్య తెలిపారు. ఏడుగురు కెమిస్ట్రీ, ఆరుగురు ఇంగ్లీష్, ఐదుగురు బాటనీ, ఐదుగురు హిస్టరీ, నలుగురు జువాలజీ, ముగ్గురు ఫిజిక్స్, ఇద్దరు చొప్పున మ్యాథ్స్, తెలుగు, హిందీ, ఎకనమిక్స్, ఒకరు కామర్స్-  లెక్చరర్లు ఉన్నట్లు చెప్పారు.

ఇప్పటి వరకు 25 మంది జాయిన్  కాగా, మిగిలిన 14 మంది రెండు, మూడు రోజుల్లో జాయిన్  అవుతారని తెలిపారు. కొత్త లెక్చరర్ల​కేటాయింపుతో జిల్లాలోని అన్ని గవర్నమెంట్​ కాలేజీల్లో స్టూడెంట్లకు మెరుగైన బోధన అందుతుందని చెప్పారు.