హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్లు ట్రాఫిక్ విధులు నిర్వర్తించనున్నారు. రేపటి(సోమవారం, డిసెంబర్ 23) నుంచే వీరు విధుల్లోకి ఎక్కనున్నారు. ఈ మేరకు నగర కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటన చేశారు.
39 మంది ట్రాన్స్‌జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్‌లుగా నియమితులైనట్లు సీవీ ఆనంద్ తెలిపారు. వీరికి 15 రోజుల పాటు శిక్షణ ఇచ్చినట్లు సీపీ వెల్లడించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్‌లో సీవీ ఆనంద్ డెమో నిర్వహించారు. వీరంతా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పని చేయనున్నారు.