గెయిల్​లో 391నాన్- ఎగ్జిక్యూటివ్ పోస్టులు

గెయిల్​లో 391నాన్- ఎగ్జిక్యూటివ్ పోస్టులు

గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్  దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గెయిల్‌‌ వర్క్ సెంటర్లు/ యూనిట్‌‌లలో 391 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

అర్హతలు: పోస్టును అనుసరించి పదోతరగతి, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీబీఎస్‌‌, బీబీఎం, బీఈ, బీటెక్‌‌, ఎమ్మెస్సీ, ఎంకాం, పీహెచ్‌‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
సెలెక్షన్​ ప్రాసెస్​: రాత పరీక్ష, కంప్యూటర్‌‌ ప్రొఫీషియన్సీ టెస్ట్‌‌, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఫిజికల్‌‌ ఎండ్యూరెన్స్‌‌ టెస్ట్‌‌ ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది. జూనియర్ ఇంజినీర్ పోస్టులకు రూ.35,000- నుంచి 1,38,000. జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ కెమిస్ట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు రూ.29,000-  నుంచి రూ.1,20,000. మిగిలిన పోస్టులకు రూ.24,500- నుంచి రూ.90,000  జీతం చెల్లిస్తారు.
అప్లికేషన్స్​: ఆన్​లైన్​లో సెప్టెంబర్​ 7వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు రూ.50 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు. వివరాలకు www.gailonline.com వెబ్​సైట్​లో సంప్రదించాలి.