![సిద్ధార్థ్ హీరోగా మన ఇంటి కథ.. సినిమా పేరు ‘త్రీ బీహెచ్‌కే ’..](https://static.v6velugu.com/uploads/2025/02/3bhk-tamil-title-teaser-siddharth-sarath-kumar-sri-ganesh-amrit-ramnath-arun-viswa_yw2teSC1Pm.jpg)
సిద్ధార్థ్ హీరోగా శ్రీగణేష్ దర్శకత్వంలో అరుణ విశ్వ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరత్ కుమార్, దేవయాని, యోగి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గురువారం ఈ మూవీ టైటిల్, టీజర్‌ను రిలీజ్ చేశారు. దీనికి ‘త్రీ బీహెచ్‌కే ’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ను ప్రకటించారు. ‘ప్రతి ఆర్డినరీ ఫ్యామిలీ వెనుక.. ఒక ఎక్స్‌ట్రార్డినరీ స్టోరీ ఉంటుంది’ అని ట్యాగ్‌లైన్ ఇవ్వడం ఆసక్తిని పెంచింది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సిద్ధార్థ్‌తో పాటు శరత్‌కుమార్, దేవయాని బ్యూటిఫుల్ ఫ్యామిలీగా కనిపిస్తూ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది.
‘ఇది మన ఇంటి కథ .. ఈ ఇంట్లోనే చిన్న చిన్నగా చాలా కథలు ఉన్నాయి. ఇది మసాల డబ్బా కాదు.. అమ్మ చిన్న బ్యాంక్. ఇది నాన్న సెంటిమెంటు బీరువా’ అంటూ సిద్ధార్థ్ వాయిస్‌తో మొదలైన టైటిల్ టీజర్ ఫీల్ గుడ్ మూమెంట్స్ తో చాలా క్యూరియాసిటీని పెంచింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా టీజర్‌ను కట్ చేశారు. ఈ చిత్రానికి అమృత్ రామ్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో సమ్మర్‌లో సినిమా రిలీజ్ కానుంది.