ఆజాది కా అమృత్ 3కె రన్

ఆజాది కా అమృత్ 3కె రన్

హైదరాబాద్: ఆజాది కా అమృత్ మొహోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా నుండి 3కె ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమైన ఈ రన్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్,  డిజిపి మహేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. జీహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్, క్రీడా శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు కూడా ఈ రన్ లో  పాల్గొన్నారు. దాదాపు 3 వేలమంది రన్నర్లు 3కె రన్ లో  పాల్గొన్నారు. క్రీడాకారులతోపాటు యువతీ యువకులు, ఉద్యోగులు, అధికారులు కూడా పాలుపంచుకున్నారు. పీపుల్స్ ప్లాజా నుండి ప్రారంభమైన ఈ రన్ లుంబినీ పార్క్, లక్ డి కాపూల్, పోలీసు కంట్రోల్ రూమ్ మీదుగా ఎల్. బి. స్టేడియం చేరుకుంది.