‘రామబాణం’ నుండి లవ్ మెలోడీ సాంగ్ 

గోపీచంద్, డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన  చిత్రం ‘రామబాణం’.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన ఈ చిత్రం మే 5న విడుదలవుతోంది. ఇప్పటికే రిలీజైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సోమవారం మూడో పాటను హీరోయిన్ శ్రీలీల విడుదల చేసి టీమ్‌‌‌‌కి బెస్ట్ విషెస్ చెప్పింది.

‘మొదటిసారిగా మనసుపడి.. వదలకుండా నీ వెంటపడి.. మొదలయింది నా గుండెల్లో  లవ్ మెలోడీ’ అంటూ సాగిన పాటలో గోపీచంద్, డింపుల్ స్టైలిష్ లుక్స్‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నారు. కోల్‌‌‌‌కతా బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో  విజువల్స్ ప్లెజెంట్‌‌‌‌గా ఉన్నాయి. మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన పాటకు శ్రీమణి క్యాచీ లిరిక్స్ రాశాడు. రితేష్ రావు పాడిన విధానం బాగుంది. దినేష్ కుమార్ కొరియోగ్రఫీలో.. సింపుల్ డ్యాన్స్ మూమెంట్స్ చేస్తూ ఆకట్టుకున్నారు గోపీ, డింపుల్. జగపతి బాబు, ఖుష్బూ, సచిన్ ఖేడ్కర్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు.