చెరువు మత్తడి పేల్చిన కేసులో నలుగురు అరెస్ట్‌‌‌‌

చెరువు మత్తడి పేల్చిన కేసులో నలుగురు అరెస్ట్‌‌‌‌
  •     నిందితుల్లో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కౌన్సిలర్‌‌‌‌ భర్త
  •     ఇండ్లు ముంపునకు గురవుతున్నాయనే మత్తడి పేల్చినట్లు గుర్తింపు

కోల్​బెల్ట్​/చెన్నూరు, వెలుగు : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ శివారులోని శనిగకుంట చెరువు మత్తడిని పేల్చిన ఘటనలో నలుగురిని చెన్నూరు పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం చెన్నూరు పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్‌‌‌‌ ఏసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. శనిగకుంట చెరువు పూర్తిగా నిండిన టైంలో పక్కనే ఉన్న 11వ వార్డు ముంపునకు గురై నీరు ఇండ్లలోకి చేరుతోంది. దీంతో మత్తడి ఎత్తు తగ్గించేందుకు స్థానిక కౌన్సిలర్‌‌‌‌ భర్త పెండ్యాల లక్ష్మణ్‌‌‌‌ తన ఫ్రెండ్స్‌‌‌‌ భీం మధుకర్, రసమల్ల శ్రీనివాస్‌‌‌‌తో కలిసి ప్లాన్‌‌‌‌ చేశాడు.

 ఇందుకోసం మంచిర్యాల పట్టణానికి చెందిన గోగుల దానయ్యతో రూ.30 వేలకు అగ్రిమెంట్‌‌‌‌ చేసుకున్నాడు. ఇందులో భాగంగా ఈ నెల 13న రాత్రి గోగుల దానయ్య తన వద్ద ఉన్న కంప్రెషర్‌‌‌‌ డ్రిల్లర్‌‌‌‌తో మత్తడి గోడను పగులగొట్టే ప్రయత్నం చేయగా సాధ్యం కాలేదు. దీంతో జిలెటిన్‌‌‌‌ స్టిక్స్‌‌‌‌ కొనుగోలుకు డబ్బులుకావాలని కోరడంతో భీం మధుకర్‌‌‌‌ రెండు దఫాలుగా రూ.17 వేలు ఫోన్‌‌‌‌ పే ద్వారా పంపించాడు. తర్వాత 16న పెండ్యాల లక్ష్మణ్‌‌‌‌, రసమల్ల శ్రీనివాస్, భీం మధుకర్, గోగుల దానయ్య శనిగకుంట చెరువు వద్దకు చేరుకున్నారు. కంప్రెషర్‌‌‌‌ డ్రిల్లర్‌‌‌‌తో మత్తడి గోడకు రంధ్రాలు చేసి జిలిటెన్‌‌‌‌ స్టిక్స్‌‌‌‌ పెట్టి పేల్చివేశారు. 

ఘటనపై ఇరిగేషన్‌‌‌‌ ఆఫీసర్ల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంఇచ ట్రాక్టర్, కంప్రెషర్‌‌‌‌ డ్రిల్లర్‌‌‌‌, నాలుగు జిలిటెన్‌‌‌‌ స్టిక్స్‌‌‌‌, 50 మీటర్ల వైర్, 30 మీటర్ల బ్లాస్టింగ్‌‌‌‌ వైర్‌‌‌‌, రెండు సెల్‌‌‌‌ఫోన్స్‌‌‌‌, బైక్‌‌‌‌ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ చెప్పారు. నిందితులను పట్టుకున్న ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ రవీందర్‌‌‌‌, ఎస్సై శ్వేత, పోలీసులు టిక్కయ్య, భూమన్న, అబ్దుల్​ ఖదీర్‌‌‌‌ను డీసీపీ అభినందించారు.