
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో విషాద ఘటన జరిగింది. పథార్ ప్రతిమ పరిధిలోని ధోలాఘాట్ గ్రామంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. సిలిండర్ పేలుడు తీవ్రతకు ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.
South 24 Parganas, West Bengal: A powerful explosion occurred while making firecrackers in Patharpratima under, Dholaahat police station limits, resulting in the death of two people and leaving several others seriously injured pic.twitter.com/AjVoNOt6dS
— IANS (@ians_india) March 31, 2025
అర్ధరాత్రి భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో 11 మంది ఉన్నారని అంచనా.. ఈ ఇంటిని బాణాసంచా తయారీ కేంద్రంగా ఉపయోగిస్తున్నారని స్థానికులు చెప్పుకొచ్చారు.
STORY | 7 people, including 4 children, killed in gas cylinder blast in Bengal
— Press Trust of India (@PTI_News) March 31, 2025
READ: https://t.co/9t9uCOSzy8
VIDEO |
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/dv5TRAShcC) pic.twitter.com/f9rFioqQIh
చనిపోయిన ఏడుగురు ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు కావడంతో కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకున్న మహిళను స్థానికులు కాపాడారు. తీవ్రంగా గాయపడిన ఆమెను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఒక్క గ్యాస్ సిలిండర్ అయితే ఇంత పేలుడు సంభవించి ఉండదని, రెండు గ్యాస్ సిలిండర్లు పేలి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.