- తమిళనాడులో 4 కోట్ల క్యాష్ పట్టివేత
- బీజేపీ అభ్యర్థికి చెందిన సొమ్మేనని అనుమానాలు
చెన్నై : తమిళనాడులో అక్రమంగా తరలిస్తు న్న రూ. 4 కోట్ల క్యాష్‌ను ఆదివారం అధికారులు పట్టుకున్నారు. బీజేపీ అభ్యర్థి అనుచరు లుగా అనుమానిస్తున్న ముగ్గురి నుంచి ఈ నగదును స్వాధీనం చేసుకున్నా రు. ‘‘ముగ్గురు వ్యక్తులు ఎగ్మోర్ నుంచి రైల్లో తిరునల్వేలికి వెళ్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం వారిని చేజ్ చేసింది. తాంబరం వద్ద అడ్డగించి సోదాలు చేయ గా వారి లగేజీల్లో క్యాష్ కనిపించింది.
ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అధికా రులు సీజ్ చేశారు. ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు” అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) తెలిపారు. ఘటనపై ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ సమగ్ర దర్యాప్తు ప్రారంభిస్తుందన్నా రు. ఈ ముగ్గురూ తిరునల్వేలి బీజేపీ అభ్యర్థి నైనార్ నాగేంద్రన్ మద్దతుదారుల ని పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా, నాగేంద్రన్‌పై చర్యలు తీసుకోవాలంటూ సీఈవోకు డీఎంకే ఫిర్యాదు చేసింది. ఓటర్లకు డబ్బులు పంచేందుకు నాగేంద్రన్ ప్లాన్ చేశారని ఆరోపించింది. అయితే, ఇదంతా తన ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నమని నాగేంద్రన్ మండిపడ్డారు.