ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. ఏప్రిల్ 12న ఉదయం ఘటనా స్థలంలో రమేశ్, మంగు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సందీప్ , లక్ష్మణ్ మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య నాలుగుకి చేరింది.
చీమలపాడు వద్ద నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు, వైరా ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అయితే నేతలను ఆహ్వానిస్తూ కార్యకర్తలు బాణాసంచా పేల్చారు. దీంతో ఆ నిప్పురవ్వలు ఎగిరిపడి సభా ప్రాంగణానికి 200 మీటర్ల దూరంలో ఉన్న గుడిసెపై పడ్డాయి. దీంతో గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండర్‌కు మంటలు అంటుకుని అది పేలిపోయింది. దీంతో ఇద్దర మరణించగా.. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్. మరణించిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ తరపున రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు వ్యక్తిగతంగా రూ. 2 లక్షలు, గాయాలైన వారికి రూ. 50 వేలు ప్రకటించారు.