ఫోర్జరీ కేసులో బల్దియా ఉద్యోగులు అరెస్టు 

ఫోర్జరీ కేసులో బల్దియా ఉద్యోగులు అరెస్టు 

గండిపేట, వెలుగు: ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అక్రమాలకు పాల్పడుతున్న బల్దియా ఉద్యోగులను రాజేంద్రనగర్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.  పోలీసులు తెలిపిన ప్రకారం.. రాజేంద్రనగర్‌ మండలం ఉప్పర్‌పల్లి సర్వే నం.  43,44,46లో ప్రభుత్వ స్థలం ఉంది. డైరీఫాం నుంచి పీవీఎన్‌ఆర్‌ ఎక్స్ ప్రెస్ వే పిల్లర్‌ నం. 213 నుంచి కిస్మత్‌పూర్‌ మీదుగా వెళ్లే రోడ్డు విస్తరణ చేపట్టాలని బల్దియా అధికారులు ప్రతిపాదించారు.

ఉప్పర్‌పల్లికి చెందిన స్థలానికి ముకరం, అష్పక్, ముక్తాదిర్‌ ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించారు. వీరికి అనుకూలంగా బల్దియా సర్కిల్‌–11లో  టీపీఎస్‌ మహ్మద్‌ కబీరుల్లాఖాన్, సిటీ ప్లానర్‌ డీవై ఎన్‌.కృష్ణమోహన్, హెడ్డాఫీసులో డీవై ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే ఎల్‌ఏ కె.శ్రీనివాస్‌రెడ్డి, సర్వేయర్‌ ఎ.దీపక్‌ సహకరించారు. ఫైల్‌ను ప్రాసెస్‌ కు నిర్ణయించారు. డీటీఆర్‌ను జారీ చేసి అనంతరం ఒక బిల్డర్‌కు 5.78 కోట్లు తీసుకుని పంచుకున్నట్టు తేలడంతో పూర్తి విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.