హైదరాబాద్ లో భారీగా గంజాయి స్వాధీనం.. నలుగురు అరెస్ట్..

హైదరాబాద్ లో భారీగా గంజాయి స్వాధీనం.. నలుగురు అరెస్ట్..

హైదరాబాద్ లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బుధవారం ( అక్టోబర్ 2, 2024 ) పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు, సౌత్ వెస్ట్ టీం సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 144.72 గ్రాముల ఒగివ్డ్ ( ఆర్గానిక్ గంజాయి ), 2కేజీల హాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. ఈ దాడుల్లో రెండు అంతర్రాష్ట్ర ముఠాలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి, హాష్ ఆయిల్ విలువ రూ.30 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. డ్రగ్ పెట్లర్ లు సయ్యద్ అబ్దుల్లా మరో నిందితుడు అనస్ అహ్మద్ షేక్ సహాయంతో మహారాష్ట్ర నుండి నగరానికి గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.గంజాయి విక్రయాల్లో వీరికి సహకరిస్తున్న హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థి ఇర్ఫాన్ రాజు షేక్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.