కెనడాలో రోడ్డు ప్రమాదం నలుగురు ఇండియన్లు మృతి

కెనడాలో రోడ్డు ప్రమాదం నలుగురు ఇండియన్లు మృతి

ఒట్టావా: కెనడాలో జరిగిన ఓ కారు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం టొరంటో సిటీలోని లేక్ షోర్ బౌలేవార్డ్ ఈస్ట్, చెర్రీ స్ట్రీట్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది. ఐదుగురు భారతీయులు టెస్లా కారులో ప్రయాణిస్తుండగా అది అదుపు తప్పి కాంక్రీట్ పిల్లర్ ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. దీంతో నలుగురు స్పాట్ లోనే చనిపోయారు. 

మరొకరికి తీవ్రమైన గాయాలయ్యాయి. రోడ్డుపై వెళ్తున్న ఓ మోటర్ సైక్లిస్ట్ గాయాలపాలైన యువతిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేల్చారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం ఉన్నవారు దర్యాప్తు అధికారులను సంప్రదించాలని పోలీసులు కోరారు. ఈ ప్రమాదంపై టొరంటోలోని ఇండియన్ కాన్సులేట్ సంతాపం వ్యక్తం చేసింది.