ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న ఓ బ్రిడ్జ్ ప్రమాదవశాత్తు కుప్పకూలింది. గ్రామ సమీపంలో గ్రీన్ఫీల్డ్ హైవే రాష్ట్రీయ రహదారిపై నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి స్లాబ్ వేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలడంతో నలుగురు కార్మికులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై నుంచి దూకి ముగ్గురు కార్మికులు ప్రాణాలు కాపాడుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన వారిని చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించారు.
హెచ్ జి ఇన్ఫ్రా కంపెనీ నిర్వాహకులు బ్రిడ్జ్ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. నిర్మాణ పనులలో నాణ్యత లోపంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.