Stock Market: ఈ వారం 4 ఐపీఓలు, రెండు లిస్టింగ్స్‌‌‌‌

Stock Market: ఈ వారం 4 ఐపీఓలు, రెండు లిస్టింగ్స్‌‌‌‌

న్యూఢిల్లీ: గత నెల రోజులుగా డల్‌‌‌‌గా ఉన్న ఐపీఓ మార్కెట్  ఈ వారం కళకళలాడనుంది. ఈ వారం ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ, మూడు ఎస్‌‌‌‌ఎంఈ ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకొస్తున్నాయి.  
    
మెయిన్‌‌‌‌బోర్డ్ ఐపీఓ ఆరిస్‌‌‌‌ఇన్‌‌‌‌ఫ్రా సొల్యూషన్స్ ఈ నెల 20న ఓపెన్‌‌‌‌ కానుంది.  కంపెనీ ఇంకా  ఐపీఓ ధరను ప్రకటించలేదు. ఈ పబ్లిక్ ఇష్యూలో 2.86 కోట్ల ఫ్రెష్ షేర్లను అమ్మాలని  చూస్తోంది. 
    
ఎస్‌‌‌‌ఎంఈ సెగ్మెంట్‌‌‌‌లో  పారాదీప్‌‌‌‌ పరివాహన్  ఐపీఓ ఈ నెల 17న ఓపెనై, 19న ముగుస్తుంది.  ఈ ఇష్యూ ద్వారా రూ.44.86 కోట్లను సేకరించాలని కంపెనీ చూస్తోంది. ఒక్కో షేరుని రూ.93–98 ప్రైస్ రేంజ్‌‌‌‌లో అమ్ముతున్నారు.
    
డివైన్‌‌‌‌ హిరా జ్యువెలర్స్ ఐపీఓ  మార్చి 17న ఓపెనై, 19 తో ముగుస్తుంది. ఒక్కో షేరు రూ.90 కి కంపెనీ అమ్మనుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.31.84 కోట్లు సేకరించాలని చూస్తోంది. 
    
గ్రాండ్ కాంటినెంట్ హోటల్స్‌‌‌‌ ఐపీఓ మార్చి20–24 న అందుబాటులో ఉంటుంది.  ఒక్కో షేరుని రూ.107–113 ప్రైస్ రేంజ్‌‌‌‌లో విక్రయిస్తున్నారు. ఈ ఇష్యూ ద్వారా రూ.74.46 కోట్లు సేకరించాలని కంపెనీ చూస్తోంది.
    
వీటితో పాటు రెండు కంపెనీల లిస్టింగ్స్ ఉన్నాయి.  పీడీపీ షిప్పింగ్‌‌‌‌  షేర్లు బీఎస్‌‌‌‌ఈ ఎస్‌‌‌‌ఎంఈలో మార్చి 18 న లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది. సూపర్ ఐరన్ ఫౌండరీ బీఎస్‌‌‌‌ఈ ఎస్‌‌‌‌ఎంఈ సెగ్మెంట్‌‌‌‌లో  మార్చి 19 న లిస్టింగ్ అవ్వనుంది.