యాదాద్రి, వెలుగు: స్పెషల్ క్లాసులకు హాజరవుతున్న టెన్త్ స్టూడెంట్లకు అల్పాహారం కోసం జిల్లా రైస్ మిల్లర్స్అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ. 4 లక్షలు సాయం అందించారు. రైస్‌మిల్లర్లలో గంపా నాగేందర్ రూ. లక్ష, పి నాగభూషణం రూ. 25 వేలు, మిగిలిన మిల్లర్లు రూ. 2.75 లక్షలు కలిసి మొత్తం రూ.4 లక్షలను గురువారం కలెక్టర్ హనుమంతు కే.జెండగేకు అందించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావు, డీఈవో కే నారాయణ రెడ్డి, సివిల్ సప్లయ్ డీఎం గోపికృష్ణ, డీసీఎస్వో శ్రీనివాసరెడ్డి, రైస్ మిలర్ల తరఫున నాగభూషణం పాల్గొన్నారు.
Also read : కలెక్టర్‌ను కలిసిన ఛాంబర్ఆఫ్ కామర్స్ ప్రతినిధులు