
అలంపూర్, వెలుగు: అయిదో శక్తి పీఠంగా విరాజిల్లుతున్న శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు బుధవారం రూ. 4 లక్షలను విరాళంగా ఓ దాత అందజేసినట్లు ఆలయ ఈవో పురేందర్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లా వాసి కేఎంసీ కంపెనీకి చెందిన ప్రభాకర్ రెడ్డి,- కవిత దంపతులు జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానానికి రూ. 4 లక్షలు విరాళాన్ని ఆలయ కమిటీ చైర్మన్ చిన్న కృష్ణయ్యకు అందజేశారు.