చత్తీస్ ఘడ్ బస్తర్ ప్రాంతం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. నారాయణ్ పూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఘటనలో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. మావోల కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.
అబుజ్ మాద్ లోని అటవీ ప్రాంతంలో అర్థరాత్రి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్త ఆపరేషన్లు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలుజరిపిన కాల్పుల్లో నలుగురు మావోలు చనిపోయారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.