అబూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నలుగురు మావోయిస్టులు మృతి

అబూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నలుగురు మావోయిస్టులు మృతి
  • ఎదురుకాల్పుల్లో డీఆర్జీహెడ్ ​కానిస్టేబుల్ దుర్మరణం
  • ఏకే–47, ఎస్ఎల్ఆర్,పేలుడు పదార్థాలు స్వాధీనం

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్ రాష్ట్రం దక్షిణ అబూజ్​మడ్ దండకారణ్యంలో శనివారం రాత్రి జరిగిన భారీ ఎన్​కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఈ ఎదురుకాల్పుల్లో డిస్ట్రిక్ట్​ రిజర్వ్​గ్రూప్​(డీఆర్జీ)కు చెందిన హెడ్​ కానిస్టేబుల్ సన్నూ కుర్రాం కూడా చనిపోయారు. ఆదివారం బస్తర్ ఐజీ సుందర్​రాజ్ ఎన్​కౌంటర్ వివరాలు మీడియాకు వెల్లడించారు. మావోయిస్టులు దక్షిణ అబూజ్​మడ్ ప్రాంతంలో సమావేశం అయ్యారనే పక్కా సమాచారంతో దంతెవాడ, నారాయణ్​పూర్, బస్తర్, కొండెగావ్ జిల్లాలకు చెందిన డీఆర్జీ, ఎస్టీఎఫ్​లతో కూడిన వెయ్యి మంది జవాన్లు శనివారం కూంబింగ్ ఆపరేషన్​కు దిగారు. 

బలగాలు గాలిస్తుండగా రాత్రి సమయంలో మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. అలర్ట్ అయిన జవాన్లు నక్సల్స్ దాడిని ప్రతిఘటించారు. నక్సల్స్ దాడిలో దంతెవాడ జిల్లాకు చెందిన సన్నూ కుర్రాం చనిపోయారు. ఎన్​కౌంటర్ ప్రదేశంలో ఇద్దరు మహిళలు సహా నలుగురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఏకె–47, ఎస్ఎల్ఆర్ తుపాకులతో పాటు ఆటోమెటిక్ వెపన్స్, పేలుడు పదార్థాలు దొరికాయి. కూంబింగ్ చేస్తున్న బలగాలపై మావోయిస్టులు కవ్వింపుగా కాల్పులు జరుపుతున్నారు. బ్యాకప్ బలగాలతో పాటు, కూంబింగ్ చేస్తున్న పోలీసులను తరలించేందుకు ఘటనా ప్రదేశానికి ఎంఐ–17 చాపర్​ను పంపించారు. మరణించిన మావోయిస్టులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని ఐజీ తెలిపారు. బలగాలు అడవి నుంచి బయటకు వచ్చాక పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు.