ఒడిశాలో భారీ ఎన్‌కౌంట‌ర్.. న‌లుగురు మావోయిస్టులు మృతి

ఒడిశాలో భారీ ఎన్‌కౌంట‌ర్.. న‌లుగురు మావోయిస్టులు మృతి

ఒడిశాలో జ‌రిగిన భారీ ఎన్‌కౌంట‌ర్ లో న‌లుగురు మావోయిస్టులు మృతి చెందారు. కందమాల్‌ జిల్లాలోని సిర్లలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఆదివారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. సిర్ల అడవుల్లో కేకేబీఎన్ డివిజన్ టాప్ క్యాడర్ సమావేశమైనట్లు పక్కా ఒడిశా పోలీసులకు సమాచారం అంద‌‌డంతో… స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, ఒడిశా పోలీసులతో ఏర్పాటైన డిస్ట్రిక్ట్ వలంటర్లీ ఫోర్స్ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని, మావోయిస్టులు సమావేశమైన ప్రదేశాన్ని చుట్టుముట్టారు.

ఈ సందర్భంగా జ‌రిగిన‌ ఎదురు కాల్పుల్లో మొత్తం నలుగురు కేకేబీఎన్ డివిజన్ మావోయిస్టులు మృతి చెందారు. సుమారు రెండు గంటలకు పైగా ఈ రెండు వర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల తరువాత కొందరు మావోయిస్టులు అడవుల్లోకి పరారయ్యారు. సంఘ‌ట‌నా స్థ‌లంలో పోలీసులు భారీగా ఆయుధాలు, మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అడవుల్లోకి పారిపోయిన మావోయిస్టుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టారు.