దారుణం: బైక్ పై వచ్చి నడిరోడ్డుపైనే కిరాతకంగా కాల్చి చంపారు..

దారుణం: బైక్ పై వచ్చి నడిరోడ్డుపైనే కిరాతకంగా కాల్చి చంపారు..

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది.. బైక్ పై వచ్చి రోడ్డుపై నిలబడి ఉన్న వ్యక్తిని కిరాతకంగా కాల్చి చంపారు దుండగులు. శుక్రవారం ( మార్చి 14 ) తెల్లవారుజామున ఉత్తర్ ప్రదేశ్ లోని అలీఘర్ లో చోటు చేసుకుంది ఈ ఘటన. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. అలీఘర్ లోని తేలి పడా ప్రాంతానికి చెందిన 25 ఏళ్ళ హారిస్ శుక్రవారం తెల్లవారుజామున రంజాన్ సెహ్రీ కోసం వెయిట్ చేస్తుండగా.. నలుగురు దుండగులు బైక్ లపై వచ్చి కిరాతకంగా కాల్చి చంపారు.

Also Read:-భారతీయ విద్యార్థిని వీసా రద్దు చేసిన అమెరికా...

మొదట ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి హారిస్ పై తుపాకీ గురిపెట్టారు. ఇది గమనించిన హారిస్ ఆత్మరక్షణ కోసం అక్కడి నుండి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే రెండో బైక్ పై వచ్చిన దుండగులు హారిస్ తుపాకీతో కాల్చేశారు. బులెట్ గాయానికి రోడ్డుపైనే పడిపోయాడు హారిస్. పడిపోయిన హారిస్ పై వరుసగా మూడు రౌండ్ల కలుపులు జరిపారు దుండగులు.

హారిస్ చనిపోయాడని నిర్దారించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు దుండగులు. ఘటన జరిగిన సమయంలో హారిస్ పక్కనే ఉన్న తన స్నేహితుడు కాల్పులకు బయపడి పారిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్నారు.