Bigg Boss Season 18: హిందీ బిగ్ బాస్ 18 ప్రోమో సూపర్బ్..కంటెస్టెంట్స్ లిస్టులో ఉన్నది వీళ్లే!

Bigg Boss Season 18: హిందీ బిగ్ బాస్ 18 ప్రోమో సూపర్బ్..కంటెస్టెంట్స్ లిస్టులో ఉన్నది వీళ్లే!

కింగ్ ఆఫ్ రియాలిటీ షోస్ అనిపించుకున్న బిగ్‌‌‌‌బాస్ ఇప్పుడు సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారింది. ఓ వైపు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతుంటే..మరోవైపు హిందీలో బ్లాక్ బ‌స్ట‌ర్ రియాలీటి షోస్ లో ఒకటైన బిగ్ బాస్ సీజన్ 18 (Bigg Boss 18) షురూ కానుంది. ఇటీవలే ప్రోమో రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. వివరాల్లోకి వెళితే..

సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 18 కోసం ప్రేక్షకుల నిరీక్షణ దాదాపు ముగిసింది. ఈ లేటెస్ట్ షో ప్రీమియర్ దగ్గర పడుతుండంతో   అభిమానులు ఉత్సాహంతో సందడి చేస్తున్నారు. దీంతో బిగ్ బాస్ 18 లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరనే లైనప్ గురించి కొత్త అప్‌డేట్‌లు కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ 18 కంటెస్టెంట్స్ లిస్టులో షోయబ్ చేరాడు. అలాగే ఈ షోలో పాల్గొనే వారు ఎవరెవరు అనేది తెలుసుకుందాం. 

బిగ్ బాస్ సీజన్ 18 కంటెస్టెంట్లు

ప్రముఖ టీవీ నటి నియా శర్మ ఈ సీజన్‌కు కంటెస్టెంట్స్ లిస్టులో ఒకరిగా ఉన్నారంటూ అధికారిక అప్‌డేట్ వచ్చింది. ఆమె పాల్గొనడం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

1. షోయబ్ ఇబ్రహీం

వివిధ TV నాటకాలలో తన పాత్రలకు మంచి గుర్తింపు తెచ్చుకున్న షోయబ్ ఇబ్రహీం..బిగ్ బాస్ 18కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shoaib Ibrahim (@shoaib2087)

2. ధీరజ్ ధూపర్

మునుపటి సీజన్ల కోసం ఈ షోలో పాల్గొనడం కోసం ప్రయత్నించినా..మరో టీవీ నటుడు ధీరజ్ ధూపర్. ఈ 2024 ఏడాదికి అధికారికంగా కంటెస్టెంట్స్ లిస్టులో చేరాడు. అయితే, అతను ఆడే ఆటకు 4-5 కోట్ల రూపాయలతో అత్యధిక పారితోషికం పొందే పోటీదారులలోఒకరిగా ఉండబోతున్నట్లు సమాచారం. 

3. దేబ్ చంద్రిమా సింఘా రాయ్

కోల్‌కతా ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రసిద్ధి చెందిన నటిగా దేబ్ చంద్రిమా సింఘా రాయ్ ఒకరు. ఆమె కూడా కంటెస్టెంట్స్ లిస్టులో అధికారికంగా ప్రకటించబడింది. ఇకపోతే.. ఈ బ్యూటీ సుహాగన్ చుడైల్‌లో నియా శర్మతో కలిసి నటించింది.

4. చాహత్ పాండే

హమారీ బహు సిల్క్ మరియు దుర్గా - మాతా కి ఛాయా వంటి షోలతో ఫేమ్ అయిన టెలివిజన్ నటి చాహత్ పాండే. ఈమె ఇపుడు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టనున్నారు. చాహత్ 2016లో పవిత్ర బంధన్‌తో తన టీవీ నటిగా ఎంట్రీ ఇచ్చింది.  

అయితే..ఈ కంటెస్టెంట్స్ అధికారికంగా ప్రకటించబడినప్పటికీ..కొంతమంది పేర్లు బయటికి వినిపిస్తున్నాయి.  వారిలో కేదార్ ఆశిష్, నియాతి ఫత్నానీ, జన్నత్ జుబైర్, మిస్టర్ ఫైసు మరియు మాక్స్‌టర్న్ వంటి సోషల్ మీడియా స్టార్‌లతో సహా పలువురు ఈ షోలో చేరనున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ 18 మొత్తం కంటెస్టెంట్స్ ఎవరనేది త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. 

ఇకపోతే.. హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌ 3 విజేత‌గా నటి సనా మక్బుల్‌ (Sana Makbul) నిలిచారు. సనా మక్బుల్‌కు, నేజీకు మధ్య చివరివరకు ఉత్కంఠ పోటీ ఉండగా..చివరకు సనానే విజేత అంటూ సీజన్‌3 హోస్ట్ అనిల్‌ కపూర్‌ అనౌన్స్ చేశారు. ఓటీటీ సీజన్‌ 3 లో గెలిచిన సనాకు  టైటిల్‌తో పాటు రూ.25 లక్షల బహుమతిని బిగ్ బాస్ హౌస్ అందించింది.