కర్నాటకలోని సిందనూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు టైర్ ఊడిపోవడంతో తుఫాన్ వాహనం బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ తో పాటు నలుగురు మృతి చెందారు.
రాయచూర్ జిల్లా సిందనూరు దగ్గర ఘటన చోటు చేసుకుంది. మృతులు ఏపీ కర్నూలు జిల్లా మంత్రాలయం వేద పాఠశాల విద్యార్థులుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.