రెండు ప్రమాదాల్లో నలుగురు మృతి

  • నల్గొండ జిల్లాలో ఇద్దరు.. నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లాలో  మరో ఇద్దరు

దేవరకొండ (కొండమల్లేపల్లి), వెలుగు : లారీ, బైక్‌‌‌‌ ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ప్రమాదం నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధిలో జరిగింది. ఎస్సై రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం సూరపల్లి గ్రామానికి చెందిన మారేపల్లి ప్రేమ్‌‌‌‌కుమార్‌‌‌‌ (27), బిహార్‌‌‌‌ రాష్ట్రానికి చెందిన అర్జున్‌‌‌‌ సహాని (29) చిలకమర్రి గ్రామ పరిధిలోని విజయవర్ధన్‌‌‌‌ కాటన్‌‌‌‌ మిల్లులో పనిచేస్తున్నారు. 

వీరిద్దరూ కలిసి బైక్‌‌‌‌పై బుధవారం కేశ్యాతండా సమీపంలోని హైదరాబాద్‌‌‌‌ కాటన్‌‌‌‌ మిల్లుకు వెళ్లారు. అక్కడ పని ముగిశాక తిరిగి వస్తూ కొండమల్లేపల్లిలోని భారత్‌‌‌‌ పెట్రోల్‌‌‌‌ బంక్‌‌‌‌ మూలమలుపు వద్దకు రాగానే వీరి బైక్‌‌‌‌ను లారీ ఢీకొట్టింది. ఇద్దరి తలలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయారు. మృతుడు ప్రేమ్‌‌‌‌కుమార్‌‌‌‌ తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

కల్వకుర్తి సమీపంలో కారు, ఆటో ఢీకొని..

కల్వకుర్తి, వెలుగు : కారు, ఆటో ఢీకొని ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఈ ప్రమాదం నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లా కల్వకుర్తి మండలం తుర్కపల్లి సమీపంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తోటపల్లి గ్రామానికి చెందిన బంగారయ్య (45), మహేశ్ (22) మరికొంత మంది కలిసి బుధవారం కల్వకుర్తికి వచ్చారు. 

పని ముగిసిన తర్వాత తిరిగి ఆటోలో స్వగ్రామానికి బయలుదేరారు. తుర్కపల్లి - తర్నికల్‌‌‌‌ గ్రామాల మధ్యలో నాగర్‌‌‌‌ కర్నూల్‌‌‌‌- కల్వకుర్తి ప్రధాన రహదారిపై ఆటోను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో బంగారయ్య, ఆటో డ్రైవర్‌‌‌‌ మహేశ్‌‌‌‌ అక్కడిక్కడే చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హైదరాబాద్‌‌‌‌కు తరలించారు.