అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్, వాహనాలు సీజ్

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా రాష్ట్రంలో లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌డంతో మందు బాబుల‌కు మ‌ద్యం దొరక‌ని ప‌రిస్థితి. ఈ ప‌రిస్థితులను ఆస‌రా చేసుకొని అక్ర‌మంగా మ‌ద్యం త‌ర‌లిస్తున్నారు కొంద‌రు వ్య‌క్తులు. పోలీసులు ఆ త‌ర‌లింపును అడ్డుకొని వారిని అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామంలో శనివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని నలుగురు వ్యక్తులను ఎక్సైజ్ సిఐ నాగేశ్వరరావు తన బృందంతో కలిసి అదుపులోకి తీసుకున్నారు . వారి వాహనాలను సీజ్ చేశారు.
సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరం గ్రామానికి చెందిన శీలం కృష్ణారెడ్డి,శీలం బ్రహ్మ రెడ్డి,యారమల పిచ్చిరెడ్డి, కృష్ణాజిల్లా మర్సుమల్లి గ్రామానికి చెందిన గంగవరపు వరప్రసాద్ లు అక్రమంగా 15 కేసుల‌ మద్యాన్ని త‌ర‌లిస్తున్న‌ట్టు చెప్పారు. వారిపై దాడి చేసి అరెస్ట్ చేశామ‌ని, ఒక టయోటా కార్, గ్లామర్ మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుళ్ళు గోపయ్య, రియాజ్, గోపి తదితరులు ఉన్నారు.