న్యూఢిల్లీ: వరల్డ్ బ్యాంక్, ఎస్ అండ్ పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ కలిసి విడుదల చేసిన ‘కంటైనర్ పోర్ట్ పెర్ఫామెన్స్ ఇండెక్స్ 2023’ లిస్ట్‌లో అదానీ పోర్ట్స్‌కు చెందిన 4 పోర్టులకు చోటు దక్కింది. ఉత్పాదకత, సమర్ధత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ లిస్టును తయారు చేశారు.
అదానీ పోర్ట్స్‌కు చెందిన ముంద్రా పోర్ట్‌కు గ్లోబల్‌గా 27 వ ర్యాంక్, కట్టుపల్లి పోర్ట్‌కు 57 వ ర్యాంక్, హజిరా పోర్ట్‌కు 68 వ ర్యాంక్, కృష్ణపట్నం పోర్ట్‌కు 71 వ ర్యాంక్ దక్కాయి. ఇండియా నుంచి 9 పోర్టులకు ఈ లిస్టులో చోటు దక్కింది.