4 క్వింటాళ్ల గంజాయి పట్టివేత

4 క్వింటాళ్ల గంజాయి పట్టివేత

భద్రాద్రికొత్తగూడెం/భద్రాచలం, వెలుగు: ఒడిశా నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్​స్మగ్లింగ్​చేస్తున్న 404 కిలోల గంజాయిని శనివారం భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు. కొత్తగూడెం ఎస్పీ బి.రోహిత్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాకు చెందిన బల్జీత్, రవిదాస్, గిన్న, తక్ ధీర్, రామ్​మెహర్, సుందర్, రాజ్ పతి ఒడిశాలోని కోలా ఆనంద్ అలియాస్​ బుజ్జి, బాల్ రెడ్డి వద్ద 404 కిలోల గంజాయిని కొన్నారు.

చిన్నచిన్న ప్యాకెట్లుగా మార్చి డోర్ మ్యాట్లు, ట్రేల మధ్యలో అమర్చారు. ఎవరికీ అనుమానం రాకుండా ఓ ప్రైవేట్​ట్రావెల్స్​బస్సు పైభాగంలో లోడ్​చేశారు. శనివారం తెల్లవారుజామున భద్రాచలంలో పోలీసులు ఆపి తనిఖీ చేస్తుండగా, ఓ వ్యక్తి బస్సు దిగి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అనుమానుంతో బస్సు మొత్తం తనిఖీ చేయగా డోర్ మ్యాట్లు, వాటర్ బాటిళ్లు, ట్రేలలో భారీ మొత్తంలో గంజాయి దొరికింది. ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.