వరంగల్ లో 4 వేల కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ

వరంగల్ లో 4 వేల కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ

వరంగల్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.4,962 కోట్లు కేటాయించింది. మామునూర్ ఎయిర్​పోర్టు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కాకతీయ మెగా టెక్స్​టైల్ పార్క్, ఔటర్ రింగ్ రోడ్డు వంటి అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. కాకతీయ అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో రూపొందించిన వరంగల్ సిటీ మాస్టర్ ప్లాన్ 2041కి సోమవారం గ్రీన్​ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జీవో 202 జారీ చేసింది.అదేవిధంగా, మామునూర్ ఎయిర్​పోర్టును మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి కావాల్సిన 253 ఎకరాలు సేకరించేందుకు రైతులను ప్రభుత్వం ఒప్పించింది.

రూ.4,170 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు

2015లో అప్పటి సీఎం కేసీఆర్ వరంగల్ సిటీలో పర్యటించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పదేండ్లు అధికారంలో ఉన్నప్పటికీ.. పట్టించుకోలేదు. 2023లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ వరంగల్ సిటీలో పర్యటించి.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక రూ.4,170 కోట్ల నిధులు కేటాయించారు.