నీట్ పేపర్ లీక్ కేసులో కీలక అప్డేట్.. సీబీఐ అదుపులో నలుగురు వైద్య విద్యార్థులు

నీట్ పేపర్ లీక్ కేసులో కీలక అప్డేట్.. సీబీఐ అదుపులో నలుగురు వైద్య విద్యార్థులు

న్యూఢిల్లీ: నీట్ యూజీ ఎగ్జామ్ పేపర్ లీక్ కేసులో నలుగురు వైద్య విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు సీబీఐ అధికారులు. నీట్ పరీక్షా పేపర్ లీక్, నీట్ అవకతవకలతో సంబంధమున్న ఎయిమ్స్ పాట్నా కు చెందిన వైద్య విద్యార్థులను గురువారం ( జూలై 18) సీబీఐ అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. 2021 బ్యాచ్ కు చెందిన ఈ వైద్య విద్యార్థులను పేపర్ లీక్ కేసులో ప్రశ్నిస్తున్నారు. ఈ నలుగురు వైద్య విద్యార్థుల ల్యాబ్ టాప్, మొబైల్ ఫోన్స్ తోపాటు రూమ్ లను సీజ్ చేశారు. ఈ నలుుగురిలో ముగ్గురు బీహార్ చెందిన వారు.. పాట్నా ఎయిమ్స్ లో మూడో సంవత్సరం వైద్య చదువుతుండగా మరొకరు జార్ఖండ్ కు చెందిన వారు.. సెకండియర్ చదువుతున్నారు. 

నీట్ పేపర్ లీక్ కేసులో ఇద్దరు కీలక నిందితులు అరెస్టయిన మరుసటి రోజే సీబీఐ అధికారులు ఈ కేసుతో సంబంధమున్న ఈ నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. బీహార్ కు చెందని నిందితులు పంకజ్ కుమార్, రాజు సింగ్ లను జార్ఖండ్ లోని హజారీబాగ్ లో నిన్న (బుధవారం ) అరెస్ట్ చేశారు. 

Also Read :- శ్రీశైలంలో చిరుత కలకలం

నీట్ పేపర్ లీక్ మాఫియలో పంకజ్ కుమార్ కీలక నిందితుడు. రాజు సహాయంతో నీట్ యూపీ ఎగ్జామ్ పేపర్లను లీక్ చేసి విక్రయించారు. పాట్నాలోని స్పెషల్ కోర్టు పంకజ్ ను 14 రోజులు సీబీఐ కస్టడీకి పంపింది. మరో నిందితులు రాజుకు 10 రోజుల కస్టడీకి పంపించింది.